ఓటీటీకి ఆదరణ పెరిగినా.. యూట్యూబ్‌కు తగ్గని డిమాండ్!
- జపాన్ సంస్థ అకత్సుకి సర్వే
- యానిమేషన్ కోసం యూట్యూబ్‌ను బాగా వాడుతోన్న చిన్నారులు
- 76 శాతం మంది తల్లిదండ్రుల అభిప్రాయం ఇదే
ప్రస్తుత కాలంలో టెక్నాలజీ వాడకం ఎంతగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్లను తెగవాడేస్తుండడంతో చిన్నారులూ వాటికీ అలవాటు పడిపోయారు. కరోనా సమయంలో ఓటీటీకి బాగా ఆదరణ వచ్చింది. అయినప్పటికీ, యూట్యూబ్ కు ఉన్న ఆదరణ ఏ మాత్రం చెక్కుచెదర లేదు.
యానిమేటెడ్ సిరీస్‌లు ఓటీటీలో బాగా వస్తున్నాయి. జపాన్‌కు చెందిన టెక్నాలజీ, ఎంటర్ టైన్‌మెంట్ సంస్థ అకత్సుకి భారత్‌లో చిన్నారుల యానిమేషన్ విభాగంలో ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం హైదరాబాద్ తో పాటు 10 భారతీయ నగరాలలో అధ్యయనం చేసింది. యానిమేషన్ కోసం తల్లిదండ్రులు, చిన్నారులు ఏ ప్లాట్‌ఫారంలను వాడుతున్నారో తెలుసుకుంది.
తమ పిల్లల యానిమేటెడ్ అవసరాల కోసం యూట్యూబ్ నే వాడుతున్నామని భారత్‌లోని 76 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. దీన్ని బట్టి యూట్యూబ్ కి ఇప్పటికీ ఆదరణ ఎంతగా ఉందో చెప్పవచ్చు. కరోనా సమయంలో తమ పిల్లలు యానిమేటెడ్ కార్టూన్ క్యారెక్టర్లను చూడడం పెరిగిందని 69 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు.