ఆసక్తిని రేపుతున్న 'నల్లమల' టీజర్!

  • విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న అమిత్
  • హీరోగా పరిచయం చేస్తున్న 'నల్లమల'
  • 1980 నేపథ్యంలో సాగే కథ
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు  
ఈ మధ్య కాలంలో అడవి నేపథ్యంలో ఎక్కువ సినిమాలు రూపొందుతున్నాయి. అడవిలో తలదాచుకునేవారికీ .. అడవిపై ఆధిపత్యం చెలాయించడానికి కొంతమంది పెద్దలు చేసే ప్రయత్నానికి మధ్య జరిగే పోరాటమే కథలుగా వస్తున్నాయి. అలా  ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సినిమానే 'నల్లమల'.

ఇంతవరకూ విలన్ పాత్రలను ఎక్కువగా చేస్తూ వచ్చిన అమిత్ ఈ సినిమాలో హీరోగా చేశాడు. ఇక కథానాయికగా భానుశ్రీ కనిపించనుంది. ముఖ్యమైన పాత్రల్లో నాజర్ .. కాలకేయ ప్రభాకర్ కనిపించనున్నారు. రవిచరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక టీజర్ ను రిలీజ్ చేశారు.

ఇది 1980నాటి కథ .. 'నల్లమల'లో అంతర్యుద్ధం మొదలైందంటూ ఈ టీజర్ ను ఆవిష్కరించారు. 'నల్లమల'లో అప్పటి పరిస్థితులను కళ్ల ముందుంచే ప్రయత్నం చేశారు. ఫొటోగ్రఫీ .. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.


More Telugu News