మరో 100కి పైగా యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించిన గూగుల్
- కలకలం రేపుతున్న గ్రిఫ్ట్ హార్స్ మాల్వేర్
- ఆండ్రాయిడ్ యూజర్లపై పెను ప్రభావం
- కోట్లాది రూపాయల నష్టం
- గ్రిఫ్ట్ హార్స్ ను గుర్తించిన జింపెరియమ్
- అప్రమత్తమైన గూగుల్
ఇటీవల గ్రిఫ్ట్ హార్స్ అనే మాల్వేర్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది యాప్ ల ద్వారా మొబైల్ ఫోన్లలో తిష్టవేసి తీవ్ర నష్టం కలుగజేస్తుంది. జింపెరియమ్ అనే సైబర్ భద్రత సంస్థ గ్రిఫ్ట్ హార్స్ పై ఆయా టెక్ సంస్థలను అప్రమత్తం చేసింది. ఈ డేంజరస్ మాల్వేర్ కారణంగా ఆండ్రాయిడ్ యూజర్లు కోట్లాది రూపాయలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో గూగుల్ కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. గ్రిఫ్ట్ హార్స్ మాల్వేర్ కలిగివున్న 136 యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్ ల జాబితాను ప్రకటించిన గూగుల్... ఆయా యాప్ లు ఎవరి ఫోన్ లో అయినా ఉంటే వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. గ్రిఫ్ట్ హార్స్ అనేది ట్రోజన్ రకానికి చెందిన మాల్వేర్. ఇది ఓ మొబైల్ లో చొరబడితే అందులోని యాప్ లు అన్నింటిని మాల్వేర్లుగా మార్చేస్తుంది.