మధ్యాహ్నం తర్వాత నష్టాల నుంచి భారీ లాభాల్లోకి మార్కెట్లు!

  • 446 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 131 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • ఐదు శాతం వరకు పెరిగిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల జోరును కొనసాగించాయి. ఈజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు నష్టాల్లోనే కొనసాగాయి.

ఆ తర్వాత రిలయన్స్, టీసీఎస్, భారతి ఎయిర్ టెల్, హెడ్చీఎఫ్సీ వంటి హెవీ వెయిట్ కంపెనీల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 446 పాయింట్లు లాభపడి 59,745కి చేరుకుంది. నిఫ్టీ 131 పాయింట్లు పెరిగి 17,822 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.96%), భారతి ఎయిర్ టెల్ (2.63%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.21%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.12%), టైటాన్ కంపెనీ (2.04%).

టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-1.33%), ఐటీసీ (-0.82%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.81%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.73%), టాటా స్టీల్ (-0.48%).


More Telugu News