ఎలక్షన్ అంటూ బతుకమ్మ చీరలు రాకుండా చేశారు!: హరీశ్ రావు
- ఈ నెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక
- ఈటలపై హరీశ్ విమర్శలు
- కేసీఆర్ కు గోరీ కడతావా అంటూ ఆగ్రహం
- నిన్ను మంత్రిని చేసింది ఎవరు? అంటూ నిలదీత
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆరుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, గెలిపించి మంత్రిని చేస్తే కేసీఆర్ కే గోరీ కడతావా? అంటూ మండిపడ్డారు. ఎలక్షన్ అని బతుకమ్మ చీరలు రాకుండా చేశారని వ్యాఖ్యానించారు.
బీజేపీ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. నల్ల డబ్బు వెనక్కి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారని, ఏడేళ్ల బీజేపీ పాలనలో ఒక్క రూపాయి అయినా వేశారా? అని ప్రశ్నించారు. ఈటల పార్టీ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని అన్నారు.
తన సభలో కావాలనే కరెంట్ కట్ చేశారన్న ఈటల ఆరోపణలకు బదులిస్తూ... నీ జనరేటర్ లో డిజిల్ అయిపోయిందంటూ హరీశ్ ఎద్దేవా చేశారు.