నేడు కూడా లాభాలలో ముగిసిన స్టాక్ మార్కెట్
- చాలాసేపు ఊగిసలాటలో మార్కెట్లు
- చివరి గంటలో మదుపరుల కొనుగోళ్లు
- 148.53 పాయింట్ల లాభంతో సెన్సెక్స్
- 46 పాయింట్ల లాభంతో ముగిసిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండూ రోజు కూడా లాభాలలో ముగిశాయి. ఈ రోజు ఉదయం నుంచీ మార్కెట్లు నష్టాలలోనే ట్రేడ్ అయ్యాయి. దేశంలో విద్యుత్ సంక్షోభం తలెత్తుతోందన్న భయాలు ఓపక్క... అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు మరోపక్క మదుపరులను అప్రమత్తం చేయడంతో ట్రేడింగ్ ఊగిసలాటలో కొనసాగింది.
అయితే, కేంద్రం విద్యుత్ సమస్య పరిష్కారం విషయంలో రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేయడంతో మదుపరులలో విశ్వాసం నెలకొని చివరి గంటలో కొనుగోళ్లకు దిగారు. దీంతో సెన్సెక్స్ 148.53 పాయింట్ల లాభంతో 60,284.31 వద్ద; నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 17,991.95 వద్ద క్లోజ్ అయ్యాయి.
ఇక నేటి సెషన్లో కెనరా బ్యాంక్, బాటా ఇండియా, టైటన్ కంపెనీ, జూబిలెంట్ ఫుడ్, ఎస్సారెఫ్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సెర్వ్, హీరో మోటాకార్ప్, కోటక్ మహీంద్రా తదితర కంపెనీలు లాభాలు గడించాయి. మరోపక్క, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ, ఐసీఐసీఐ బ్యాంక్, అపోలో హాస్పిటల్ తదితర షేర్లు నష్టాలు పొందాయి.