భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అలరిస్తోన్న యాడ్!
- ఈ నెల 24న భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్
- చాలా కాలం తర్వాత తలపడుతోన్న జట్లు
- 'బయ్ వన్, బ్రేక్ వన్' అంటూ టీవీ దుకాణం ఆఫర్ ఇస్తున్నట్లు యాడ్
ఐపీఎల్ వరల్డ్ కప్‌లో భాగంగా ఈ నెల 24న భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఇరు జట్ల మధ్య మ్యాచ్ అంటే భారత్, పాక్ అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. అంతేగాక, 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఈ రెండు జట్లు పోటీ పడలేదు.
చాలా కాలం తర్వాత ఈ రెండు జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ప్రసారం చేయనున్న స్టార్ స్పోర్ట్స్ రూపొందించిన ఓ ప్రకటన అలరిస్తోంది. ఈ యాడ్ లో ఏముందంటే.. ఓ పాక్ క్రికెట్ అభిమాని దుబాయ్‌లోని ఓ ఎలక్ట్రానిక్ షాప్‌కి వెళ్తాడు. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను చూసేందుకు కొత్త టీవీ కొనాలని చెబుతాడు. ఈ సారి తమ దేశ జట్టులో బాబర్ అజామ్, రిజ్వాన్ లాంటి ఆటగాళ్లు ఉన్నారని, భారత్‌ను ఓడిస్తారని అంటాడు.
దీంతో షోరూమ్ యజమాని అతడితో 'బయ్ వన్, బ్రేక్ వన్' అంటూ ఓ ఆఫర్ ఇస్తాడు. ప్రపంచకప్ లో టీమిండియాపై ఇప్పటివరకు పాక్ గెలిచిన దాఖలాలు లేవని, ఒకవేళ పాకిస్థాన్ ఓడిపోతే కోపంతో ఒక టీవీని పగులగొట్టినా రెండో టీవీ ఉంటుందని చెబుతాడు. స్టార్ స్పోర్ట్స్ విడుదల చేసిన ఈ యాడ్ అభిమానులను అలరిస్తోంది.