చాగంటి ప్రొడక్షన్ లో ఆది సాయికుమార్ కొత్త చిత్రం ప్రారంభం
- ఆది హీరోగా క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్
- నిర్మాత అజయ్ శ్రీనివాస్.. దర్శకత్వం శివశంకర్ దేవ్
- కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యానన్న ఆది
ఆది సాయికుమార్ హీరోగా చాగంటి ప్రొడక్షన్ లో నూతన చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం రామానాయుడు స్టూడియోస్ లో వైభవంగా జరిగింది. శివశంకర్ దేవ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్న ఈ మూవీని అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందబోతున్న ఈ మూవీ ఆది కెరియర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.
ప్రముఖ నిర్మాత పుస్కర రామ్మోహాన రావు హీరో ఆదిపై క్లాప్ ఇవ్వగా... నిర్మాత కేఎస్ రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, లగడపాటి శ్రీధర్ ఈ ప్రారంభోత్సవానికి హాజరై చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
పూజ అనంతరం నిర్మాత అజయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ... 'మా నాన్నగారు శాంతయ్య గత 32 సంవత్సరాలుగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నారు. కారంచేడు మా స్వగ్రామం. రామానాయుడుగారి స్పూర్తితో ఇండస్ట్రీకి వచ్చిన మా నాన్నగారు నేను నిర్మాతగా మారడానికి ప్రోత్సాహం అందించారు. మంచి కథను రెడీ చేసుకుంటే ప్రొడ్యూసర్ గా అవకాశం ఇస్తానన్నారు. దేవ్ చెప్పిన కథ నాకు బాగా నచ్చడంతో ఆ కథపై ఒక సంవత్సర కాలంగా పని చేసాము. ఆది కెరియర్ లో ఈ కథ చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. దర్శకుడు దేవ్ చాలా టాలెంటెడ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆదికి ధన్యవాదాలు. నిర్మాతగా నా తొలి ప్రయత్నానికి మీ అందరి ఆశీస్సులు కావాలి. నవంబర్ రెండో వారంలో షూటింగ్ మొదలవుతుంది' అని అన్నారు.
దర్శకుడు శివశంకర్ దేవ్ మాట్లాడుతూ... ఈ చిత్రం ఒక క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ అని తెలిపారు. ఆది పాత్ర డిఫరెంట్ గా ఉంటుందని చెప్పారు. హీరో ఆది మాట్లాడుతూ... 'నా కెరియర్ లో ఈ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కథ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. దర్శకుడు చాలా డీటైల్డ్ గా ఈ సినిమాపై పని చేసాడు. శాంతయ్యగారితో నాకు చాలా సంవత్సరాలుగా స్నేహం ఉంది. ఆయన కుమారుడు నిర్మాతగా నా సినిమాతో పరిచయం అవడం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు దేవ్ నాకు రెండు సంవత్సరాలుగా తెలుసు. అందరం కథను నమ్మి ముందుకు వెళుతున్నాం. హీరోయిన్ వివరాలను త్వరలోనే తెలియజేస్తాం' అని తెలిపాడు. ఈ సినిమాకు అనీశ్ సొలోమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.