ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణను పరామర్శించిన దేవినేని ఉమ

  • ఢిల్లీలో కాలుజారి పడిన మంద కృష్ణ
  • కుడికాలికి గాయం
  • శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు
  • విశ్రాంతి తీసుకుంటున్న మంద కృష్ణ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ ఇటీవల ఢిల్లీలోని ఓ హోటల్లో కాలుజారి పడడం తెలిసిందే. ఈ ఘటనలో మంద కృష్ణ కుడికాలి ఎముక విరిగింది. ఆయన కాలికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం మంద కృష్ణ విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ నేడు మంద కృష్ణ నివాసానికి వెళ్లారు. బెడ్ రెస్టు తీసుకుంటున్న ఎమ్మార్పీఎస్ అధినేతను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉమ వెంట మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఉన్నారు. గాయం తాలూకు వివరాలను మంద కృష్ణ టీడీపీ నేతలకు వివరించారు. మెడికల్ రిపోర్టులను వారికి చూపించారు.


More Telugu News