'మిస్టర్ ప్రేమికుడు'గా వస్తున్న ప్రభుదేవా!

  • తమిళంలో ప్రభుదేవా చేసిన 'చార్లీ చాప్లిన్ 2'
  • 2019లో అక్కడ సక్సెస్ అయిన మూవీ
  • తెలుగు అనువాదానికి సన్నాహాలు పూర్తి
  • ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు  
ప్రభుదేవా హీరోగా గతంలో తమిళంలో వచ్చిన 'చార్లీ చాప్లిన్' విజయవంతమైంది. ఆ సినిమాకి సీక్వెల్ గా అదే దర్శకుడితో ఆయన 'చార్లీ చాప్లిన్ 2' సినిమాను చేశాడు. 2019లో వచ్చిన ఈ సినిమాకి తమిళనాట మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాలో ఆయన సరసన నాయికలుగా నిక్కీ గల్రాని .. ఆదా శర్మ అలరించారు.

ఆ సినిమాను ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో 'మిస్టర్ ప్రేమికుడు' టైటిల్ తో ఈ సినిమా పలకరించనుంది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను ఇక్కడ రిలీజ్ చేయనున్నారు. గతంలో ప్రభుదేవా హీరోగా వచ్చిన 'ప్రేమికుడు' ఘనవిజయాన్ని సాధించింది. అందువలన ఈ సినిమా టైటిల్ కూడా అందుకు దగ్గరగా ఉండేలా చూసుకున్నారు.

ఇది కామెడీ ఎంటర్టైనర్ .. గుర్రం మహేశ్ చౌదరి ఈ సినిమాను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు. ప్రభుదేవా డాన్స్ .. సంగీతం .. సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. మరి ఇక్కడ ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.


More Telugu News