టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్
- పార్టీ అధ్యక్షుడిగా వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన కేసీఆర్
- కేసీఆర్ ఎన్నికను ప్రకటించిన కె.కేశవరావు
- అందరికీ ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా ఆయన వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేసీఆర్ ఎన్నికను పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ విజయాన్ని పార్టీ జనరల్ సెక్రటరీ కె.కేశవరావు అధికారికంగా ప్రకటించారు.
అంతకు ముందు ప్లీనరీ ఆవరణలో టీఆర్ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. తనను పార్టీ అధినేతగా ఎన్నుకున్నందుకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా ప్లీనరీని నిర్వహిస్తున్నారు. ఈ ప్లీనరీకి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ప్లీనరీలో ప్రస్తుతం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు.