టాలీవుడ్ లోకి అకీరా ఎంట్రీ... తండ్రి పవన్ తో కలిసి ఒకే చిత్రంలో కనిపించనున్న తనయుడు?
- 'హరిహర వీరమల్లు' చిత్రంలో నటిస్తున్న పవన్ కల్యాణ్
- క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
- ఓ ప్రధాన పాత్రలో అకీరా కనిపించబోతున్నాడంటూ ప్రచారం
జనసేనాని పవన్ కల్యాణ్, ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ ల కుమారుడు అకీరా నందన్ చిన్నప్పటి నుంచి హాట్ టాపిక్ గానే ఉన్నాడు. అకీరాకు సంబంధించిన ఏ వార్త అయినా సెన్సేషనల్ అవుతుంటుంది. మరోవైపు అకీరా టాలీవుడ్ ఎంట్రీకి చెందిన వార్తలు కూడా ఎన్నోసార్లు హల్ చల్ చేశాయి. అకీరా ఎంట్రీ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారందరి ఎదురుచూపులకు ముగింపు పడే సమయం ఆసన్నమైంది.
తన తండ్రి పవన్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రంలో అకీరా కనిపించనున్నాడనే వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అకీరా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడని చెపుతున్నారు. తన పాత్ర కోసం అకీరా కర్రసాము నేర్చుకుంటున్నాడని అంటున్నారు. ఇదే నిజమైతే... పవన్ ఫ్యాన్స్ కు పండగే.