అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
- భారత్ అమ్ములపొదిలో అగ్ని అస్త్రం
- అబ్దుల్ కలాం దీవి నుంచి ప్రయోగం
- లక్ష్యాన్ని ఛేదించిన ఖండాతర క్షిపణి
- అగ్ని-5 రేంజి 5 వేల కిలోమీటర్లు
- అగ్ని-5 పరిధిలోకి చైనా భూభాగం
భారత్ తన అస్త్రాలకు మరింత పదునుపెడుతోంది. ఈ క్రమంలో నేడు చేపట్టిన అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం అయింది. ఉపరితలం నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే వీలున్న ఈ క్షిపణి రేంజి 5,000 కిలోమీటర్లు. చైనాలోని కీలక ప్రాంతాలన్నీ దీని పరిధిలోకి వస్తాయి. ఈ ఖండాంతర క్షిపణిని ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలామ్ దీవి నుంచి ప్రయోగించారు. ఈ మిస్సైల్ లో మూడు దశల ఘన ఇంధన ఇంజిన్ ను అమర్చారు. ఇది అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలదు.