జోస్ బట్లర్ సూపర్ సెంచరీ... ఇంగ్లండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 163 రన్స్

  • షార్జాలో ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక
  • మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్
  • ఇంగ్లండ్ ను ఆదుకున్న బట్లర్-మోర్గాన్ జోడీ
  • లక్ష్యఛేదనలో తడబడిన శ్రీలంక
శ్రీలంకతో గ్రూప్-2 మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓపెనర్ జోస్ బట్లర్ అద్భుత సెంచరీ నమోదు చేశాడు. బట్లర్ 101 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 163 పరుగులు సాధించింది. 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ను బట్లర్, మోర్గాన్ జోడీ ఆదుకుంది. ముఖ్యంగా బట్లర్ శివమెత్తి ఆడాడు. 67 బంతులు ఎదుర్కొన్న బట్లర్ 6 ఫోర్లు, 6 సిక్సులు బాది లంక బౌలర్ల గణాంకాలను మార్చివేశాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి బట్లర్ సెంచరీ మైలురాయిని అందుకున్నాడు.

అటు, మరో ఎండ్ లో మోర్గాన్ కూడా ధాటిగా ఆడాడు. 36 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 40 పరుగులు చేశాడు. ఓ దశలో ఇంగ్లండ్ 100 పరుగులు కూడా దాటడం కష్టమే అనిపించినా... బట్లర్, మోర్గాన్ జోడీ ఎదురుదాడి చేశారు. దాంతో ఇంగ్లండ్ స్కోరు 150 మార్కు దాటింది. లంక బౌలర్లలో స్పిన్నర్ వనిందు హసరంగ 3 వికెట్లు తీయగా, చమీర 1 వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం 164 పరుగుల లక్ష్యఛేదనలో శ్రీలంక 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.


More Telugu News