భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్'కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి

  • కొవాగ్జిన్ పై సమీక్ష నిర్వహించిన డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా బృందం
  • కొవాగ్జిన్ ను ప్రపంచ దేశాలకు సరఫరా చేసే అవకాశం
  • భారతీయులు విదేశాలకు వెళ్లినప్పుడు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం ఉండదు
హైదరాబాదుకు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి లభించింది. కొవాగ్జిన్ ను అత్యవసర వినియోగ జాబితాలో చేర్చేందుకు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం తెలిపింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ డేటా, రోగ నిరోధకత, భద్రత, సామర్థ్యం తదితర అంశాలపై డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా బృందం సమీక్ష నిర్వహించింది. అనంతరం ఈ టీకాకు డబ్ల్యూహెచ్ఓ ఆమోదముద్ర వేసింది.

 ఈ గుర్తింపు వల్ల టీకాను ప్రపంచ దేశాలకు సరఫరా చేసే వీలు కలుగుతుంది. ఈ టీకాను తీసుకున్న భారత పౌరులు విదేశాలకు వెళ్లినప్పుడు వారిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. వారు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం ఉండదు. కొవాగ్జిన్ ను భారత్ లో పెద్ద ఎత్తున వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టీకా రెండు డోసులు తీసుకుంటే కరోనాకు సంబంధించిన పలు వేరియంట్ల నుంచి రక్షణ లభిస్తుంది.


More Telugu News