దేశంలో వంట నూనెల ధరలు తగ్గాయి.... ఏ నూనె ఎంత తగ్గిందంటే..!

  • దేశంలో భగ్గుమంటున్న వంటనూనెల ధరలు
  • చర్యలు తీసుకున్న కేంద్రం
  • గత అక్టోబరులో పన్నులు తగ్గింపు
  • తాజాగా స్టాక్ పరిమితుల అమలు
  • వ్యాపారుల వద్ద ఉండే నిల్వలపై ఆంక్షలు
గత కొంతకాలంగా దేశంలో వంటనూనెల ధరలు భగ్గుమంటున్నాయి. అక్టోబరులోనే కేంద్రం పన్నులు తగ్గించినా ధరలు దిగిరాకపోవడంతో, కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. వ్యాపారుల వద్ద ఉన్న వంట నూనెలు, నూనె గింజల నిల్వలపై వచ్చే ఏడాది మార్చి 31 వరకు పరిమితి విధించింది. స్టాక్ పరిమితులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది.

ఈ నేపథ్యంలో వంటనూనెల ధరలు కొద్దిమేర తగ్గాయి. పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనె, సోయాబీన్ నూనెల ధరలు తగ్గినట్టు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం కార్యదర్శి సుధాంశు పాండే తెలిపారు. అన్ని ప్రధానమైన వంట నూనెలకు ధర తగ్గింపు వర్తిస్తుందని తెలిపారు.

తగ్గింపు వివరాలు

  • పామాయిల్- రూ.20
  • వేరుశనగ నూనె- రూ.18
  • సోయాబీన్ నూనె- రూ.10
  • సన్ ఫ్లవర్ ఆయిల్- రూ.7



More Telugu News