షోయబ్ మాలిక్ మెరుపు ఇన్నింగ్స్... పాకిస్థాన్ భారీ స్కోరు
- షార్జాలో పాక్ వర్సెస్ స్కాట్లాండ్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
- 18 బంతుల్లో 54 పరుగులు చేసిన మాలిక్
- 6 సిక్సర్లు బాదిన సీనియర్ ఆటగాడు
టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో తన చివరి లీగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు స్కాట్లాండ్ తో ఆడుతోంది. షార్జా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 189 పరుగుల భారీ స్కోరు సాధించింది.
మిడిలార్డర్ లో షోయబ్ మాలిక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సిక్సర్ల మోత మోగించిన మాలిక్ కేవలం 18 బంతుల్లోనే 54 పరుగులు సాధించాడు. మాలిక్ స్కోరులో 1 ఫోరు, 6 సిక్సులు ఉండడం విశేషం. వీటిలో మూడు సిక్సులను మాలిక్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో కొట్టాడు.
అంతకుముందు కెప్టెన్ బాబర్ అజామ్ మరోసారి తన ఫామ్ చాటుతూ 66 పరుగులు చేశాడు. 47 బంతులు ఎదుర్కొన్న బాబర్ 5 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు. వెటరన్ బ్యాట్స్ మన్ మహ్మద్ హఫీజ్ 19 బంతుల్లో 31 పరుగులు చేశాడు. స్కాట్లాండ్ బౌలర్లలో క్రిస్ గ్రీవ్స్ 2 వికెట్లు తీశాడు. హమ్జా తాహిర్ 1, సఫియాన్ షరీఫ్ 1 వికెట్ పడగొట్టారు.