డేటింగ్ యాప్ లో తన ప్రొఫైల్ ఉందనే వార్తలపై లారా దత్తా స్పందన

  • ఏ డేటింగ్ యాప్ లోనూ నేను లేను
  • అయితే డేటింగ్ యాప్స్ కు నేను వ్యతిరేకం కాదు
  • ఒకరినొకరు కలుసుకోవడానికి ఈ యాప్స్ ఉపయోగపడతాయి
బాలీవుడ్ నటి, టెన్నిస్ ఆటగాడు మహేశ్ భూపతి భార్య లారా దత్తాకు చెందిన ప్రొఫైల్ ఒక డేటింగ్ సైట్ లో ఉందనే వార్తలు సంచలనం రేకెత్తించాయి. ఈ వార్తలపై 43 ఏళ్ల లారా దత్తా స్పందించారు. ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేశారు.

'నేను ఇప్పుడే కాదు ఎప్పుడూ ఏ డేటింగ్ సైట్లో లేనని' ఆమె అన్నారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తనపై విపరీతమైన ప్రచారం జరిగిందని... అందుకే దీనికి సమాధానం ఇవ్వాలనుకున్నానని చెప్పారు. డేటింగ్ యాప్ లో తన ప్రొఫైల్ ఉందని వారంటున్నారని... ఇది తనను చాలా ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరికి క్లారిటీ ఇస్తూ వచ్చానని... చివరకు ఆన్ లైన్ ద్వారా అందరికీ ఒకే సారి క్లారిటీ ఇస్తున్నానని తెలిపారు.

డేటింగ్ యాప్స్ కు తాను వ్యతిరేకం కాదని... జనాలు ఒకరినొకరు కలుసుకోవడానికి ఈ యాప్స్ ఎంతో ఉపయోగపడతాయని లారా వ్యాఖ్యానించింది. అయితే, ఇప్పటి వరకు తాను డేటింగ్ యాప్ లో లేనని చెప్పారు. ఈ వార్తలను నమ్మొద్దని కోరారు.


More Telugu News