బ్రాహ్మణులు, బనియాలపై బీజేపీ నేత మురళీధర్‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడిన కాంగ్రెస్!

  • బ్రాహ్మణ, బనియాలు మా జేబులోని వ్యక్తులు
  • అన్ని వర్గాల శ్రేయస్సుకు పార్టీ పాటుపడుతోందన్న మురళీధర్‌రావు
  • బ్రాహ్మణులపై బీజేపీకి ఉన్న నిబద్ధత ఇదేనన్న కాంగ్రెస్
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ మధ్యప్రదేశ్ ఇంచార్జ్ పి.మురళీధర్‌రావు బ్రాహ్మణులు, బనియాలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన బ్రాహ్మణులు, బనియాలు తమ జేబులోని వ్యక్తులని వ్యాఖ్యానించారు. ఈ సామాజిక వర్గాల నుంచి ఎక్కువమంది పార్టీ కార్యకర్తలుగా వుండడం వల్ల మీడియా కూడా బీజేపీని బ్రాహ్మణ, బనియాల పార్టీగా పిలుస్తుందని అన్నారు. అయితే, బీజేపీ అన్ని వర్గాల శ్రేయస్సును కోరుతుందని స్పష్టం చేశారు.

మరోపక్క, బ్రాహ్మణులు తమ జేబులో ఉన్నారన్న మురళీధర్ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మాట్లాడుతూ.. పార్టీ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన వర్గాల పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధత ఇదేనని అన్నారు. ఆ పార్టీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని, బ్రాహ్మణులు, బనియాలను కించపరిచారని అన్నారు. కాంగ్రెస్ విమర్శలపై స్పందించిన మురళీధర్‌రావు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. తన వ్యాఖ్యలను ఆ పార్టీ వక్రీకరించిందని మండిపడ్డారు.


More Telugu News