లాభాల్లో ప్రారంభమై నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 112 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 24 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 5 శాతానికి పైగా లాభపడ్డ ఎం అండ్ ఎం షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత చివరి వరకు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న మార్కెట్లు చివరకు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 112 పాయింట్లు నష్టపోయి 60,433కి పడిపోయింది. నిఫ్టీ 24 పాయింట్లు కోల్పోయి 18,044 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (5.21%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.16%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.99%), ఎల్ అండ్ టీ (0.88%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.72%).
టాప్ లూజర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.82%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.44%), బజాజ్ ఫైనాన్స్ (-1.39%), మారుతి సుజుకి (-1.34%), ఎన్టీపీసీ (-1.28%).