లాక్ డౌన్ విధించేందుకు మేము సిద్ధం: ఢిల్లీ ప్రభుత్వం

  • ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం
  • చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
  • అత్యవసరంగా సమావేశమైన కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలు
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా దారుణంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమై కాలుష్యానికి తాత్కాలికంగా చెక్ పెట్టడంపై చర్చించాయి.

ఈ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం పలు సూచనలు చేసింది. వారం రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించింది. వారాంతంలో లాక్ డౌన్ పెట్టాలని, నిర్మాణాలను, పారిశ్రామిక కార్యకలాపాలను తాత్కాలికంగా ఆపివేయాలని సూచించింది.

ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ వీకెండ్ లాక్ డౌన్ ను తాము సూచిస్తున్నామని, లాక్ డౌన్ విధించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే కోర్టు సూచన మేరకే తాము లాక్ డౌన్ విధిస్తామని చెప్పారు.


More Telugu News