తొమ్మిదేళ్ల క్రితం నాటి రోహిత్ శర్మ ట్వీట్ వైరల్!
- నిన్న టీ20లకు ఫుల్ టైం కెప్టెన్ గా రోహిత్ అరంగేట్రం
- జైపూర్ లోని స్టేడియంలో న్యూజిలాండ్ తో మ్యాచ్
- ఇదే గ్రౌండ్ లో 2012లో తొలిసారి కెప్టెన్సీ చేసిన రోహిత్
- రంజీ ట్రోఫీలో ముంబైకి నాయకత్వం
టీ20లకు ‘ఫుల్ టైం’ కెప్టెన్ గా రోహిత్ శర్మ తొలి మ్యాచ్ లోనే విజయం అందుకున్నాడు. ఇంతకుముందూ అతడు కెప్టెన్ గా వ్యవహరించినా అది కేవలం పార్ట్ టైంగానే ఉన్నాడు. కానీ, ఇప్పుడు పూర్తి స్థాయి కెప్టెన్ హోదాలో జట్టును నడుపుతున్నాడు. నిన్న న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లతో ఇండియా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ తొమ్మిదేళ్ల క్రితం చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
‘‘జైపూర్ లో అడుగుపెట్టాం. అవును, నేనే జట్టుకు ఇప్పుడు కెప్టెన్. అది నా మీద మరింత బాధ్యతను పెంచింది’’ అంటూ 2012 నవంబర్ 7న రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు. అయితే, ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ఆ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.
కారణం లేకపోలేదు. రంజీ ట్రోఫీ సందర్భంగా రోహిత్ శర్మ తొలిసారి ముంబైకి కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ అరంగేట్ర మ్యాచ్ జైపూర్ లోని కేఎల్ సైని గ్రౌండ్ లోనే జరిగింది. తాజాగా టీ20 కెప్టెన్సీ అరంగేట్ర మ్యాచ్ కూడా అదే గ్రౌండ్ లో జరగడం పాత ట్వీట్ పై చర్చకు దారితీసింది. ఓ క్రికెట్ అభిమాని ఈ విషయాన్ని వివరించాడు.
ఇక, కొందరు అభిమానులు ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తో పోలికలు పెడుతూ ట్వీట్లు చేస్తున్నారు. కారణం.. ఆర్చర్ చేసిన గత ట్వీట్లను వెలికి తీస్తూ వాటిని కొత్త సంఘటనలతో పోలుస్తూ అతడి అభిమానులు రీపోస్ట్ చేస్తుంటారు. దీంతో రోహిత్ శర్మ ట్వీట్ ను ఆర్చర్ ట్వీట్లతో పోలుస్తున్నారు.