భువనేశ్వరిని అవమానించిన ఘటనపై జగన్ విచారం వ్యక్తం చేయాలి: మందకృష్ణ మాదిగ

  • ఎమ్మెల్యేలు, మంత్రులతో బహిరంగ క్షమాపణ చెప్పించాలి
  • అలాంటి వ్యాఖ్యలు చేయకుంటే రికార్డులు బహిరంగ పరచాలి
  • తప్పుడు వ్యాఖ్యలను సీఎం క్షమించరన్న సంకేతం ఇవ్వాలి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి భార్య భువనేశ్వరికి జరిగిన అవమానంపై ముఖ్యమంత్రి జగన్ విచారం వ్యక్తం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆమె వ్యక్తిత్వాన్ని దారుణంగా దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యేలతో ఆమెకు బహిరంగ క్షమాపణ చెప్పించాలని కోరారు. వైసీపీ నేతలు చెబుతున్నట్టు భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదన్నది నిజమే అయితే అసెంబ్లీ రికార్డులను బహిరంగ పరచాలన్నారు.

పగలు, ప్రతీకారాలకుపోయి మరింత రెచ్చగొట్టేలా మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేస్తే అది ప్రభుత్వానికే నష్టమన్నారు. భువనేశ్వరిని అవమానించిన ఎమ్మెల్యేలతో క్షమాపణ చెప్పిస్తే ఆమెకు కొంతైనా ఊరట లభిస్తుందని కృష్ణమాదిగ అన్నారు. అంతేకాదు, తప్పుగా మాట్లాడితే ముఖ్యమంత్రి క్షమించరనే గొప్ప సంకేతాన్ని సమాజానికి పంపిన వారవుతారన్న కృష్ణ మాదిగ.. చంద్రబాబు విలపించిన తీరు తనను కలిచివేసిందని అన్నారు.


More Telugu News