స్టాక్ మార్కెట్లలో మళ్లీ హుషారు... దూసుకుపోయిన మార్కెట్లు!
- 454 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 121 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 6 శాతానికి పైగా పెరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోయినా... మన మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 454 పాయింట్లు లాభపడి 58,795కి పెరిగింది. నిఫ్టీ 121 పాయింట్లు పుంజుకుని 17,536 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (6.10%), ఐటీసీ (1.49%), ఇన్ఫోసిస్ (1.47%), టెక్ మహీంద్రా (1.24%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (1.14%).
టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-1.23%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.22%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.12%), ఎల్ అండ్ టీ (-0.62%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-0.55%).