విశాఖ జిల్లా నుంచి మహారాష్ట్ర తరలిస్తున్న గంజాయి హైదరాబాదులో పట్టివేత

  • హైదరాబాదులో భారీగా గంజాయి స్వాధీనం
  • ఐదుగురిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు
  • 1,820 కిలోల గంజాయి లభ్యం
  • గంజాయి విలువ రూ.3 కోట్లు ఉంటుందని అంచనా
ఇటీవల కాలంలో గంజాయి స్మగ్లింగ్ వ్యవహారాల్లో విశాఖ పేరు తరచుగా వినిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ నగరంలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది. అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు వారి నుంచి 1,820 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

దీనితో సంబంధం ఉన్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.3 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఈ గంజాయి విశాఖ జిల్లా సీలేరు నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు గుర్తించారు.


More Telugu News