మరో బ్లాక్ ఫ్రైడే... 1,687 పాయింట్లు కోల్పోయి కుప్పకూలిన సెన్సెక్స్
- యూరప్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
- అమ్మకాలకు మొగ్గుచూపుతున్న ఇన్వెస్టర్లు
- 509 పాయింట్లు పతనమైన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మరో బ్లాక్ ఫ్రైడేను చవిచూశాయి. ఐరోపాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం, దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ పుట్టుకు రావడం మన మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఉదయం నష్టాలతోనే ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు పతనమవుతూనే వచ్చాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,687 పాయింట్లు నష్టపోయి 57,107కి పతనమయింది. నిఫ్టీ 509 పాయింట్లు కోల్పోయి 17,026కు దిగజారింది. హెల్త్ కేర్ మినహా ఈరోజు అన్ని సూచీలు నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ గెయినర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (3.32%), నెస్లే ఇండియా (0.35%), ఏసియన్ పెయింట్స్ (0.01%), టీసీఎస్ (0.00%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-6.01%), మారుతి సుజుకి (-5.27%), టాటా స్టీల్ (-5.23%), బజాజ్ ఫైనాన్స్ (-4.60%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-4.49%).