వారాన్ని లాభాలతో ప్రారంభించిన మార్కెట్లు
- 153 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 27 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2.40 శాతం లాభపడ్డ కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ప్రారంభించాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు ఆ తర్వాత లాభాల్లోకి వెళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 153 పాయింట్లు లాభపడి 57,260కి చేరుకుంది. నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 17,053 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కొటక్ మహీంద్రా బ్యాంక్ (2.40%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.25%), టీసీఎస్ (1.61%), టైటాన్ కంపెనీ (1.42%), బజాజ్ ఫైనాన్స్ (1.41%),
టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-2.01%), ఎన్టీపీసీ (-1.67%), యాక్సిస్ బ్యాంక్ (-1.65%), నెస్లే ఇండియా (-1.35%), బజాజ్ ఆటో (-1.32%).