భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 620 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 184 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 5.73 శాతం పెరిగిన ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. నిన్న మార్కెట్లు ముగిసిన తర్వాత వెలువడిన జీడీపీ డేటా ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపింది. దీంతో ఈరోజు వారు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 620 పాయింట్లు లాభపడి 57,684కి పెరిగింది. నిఫ్టీ 184 పాయింట్లు పుంజుకుని 17,167 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (5.73%), యాక్సిస్ బ్యాంక్ (3.46%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.19%), టెక్ మహీంద్రా (3.04%), మారుతి సుజుకీ (2.66%).
టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.58%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.45%), సన్ ఫార్మా (-1.14%), భారతి ఎయిర్ టెల్ (-1.06%), టైటాన్ (-0.57%).