భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 777 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 235 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 4 శాతం వరకు లాభపడ్డ హెచ్డీఎఫ్సీ లిమిటెడ్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. వీక్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టు ముగుస్తున్న నేపథ్యంలో మార్కెట్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. దీనికి తోడు ఆసియా మార్కెట్ల నుంచి సానుకూలతలు ఉండటం కూడా లాభించింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 777 పాయింట్లు లాభపడి 58,461కి చేరుకుంది. నిఫ్టీ 235 పాయింట్లు పెరిగి 17,401కి ఎగబాకింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (3.92%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (3.65%), సన్ ఫార్మా (3.11%), టాటా స్టీల్ (2.80%), టెక్ మహీంద్రా (2.60%).

టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-0.78%), యాక్సిస్ బ్యాంక్ (-0.55%).


More Telugu News