ఒమిక్రాన్ భయాలు.. కుప్పకూలిన మార్కెట్లు
- 764 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 204 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 4 శాతానికి పైగా నష్టపోయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లో అడుగుపెట్టిందనే భయాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 764 పాయింట్లు కోల్పోయి 57,696కి పడిపోయింది. నిఫ్టీ 204 పాయింట్లు కోల్పోయి 17,196కు దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (0.72%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.61%), టాటా స్టీల్ (0.47%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.35%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-4.03%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-3.05%), ఏసియన్ పెయింట్స్ (-2.29%), భారతి ఎయిర్ టెల్ (-1.88%), టెక్ మహీంద్రా (-1.81%).