అప్పుల్లో కూరుకుపోతున్న అన్నదాతలు.. జాబితాలో తొలి రెండు స్థానాలు తెలుగు రాష్ట్రాలవే!
- ఏపీలో 93.2 శాతం మంది రైతులకు అప్పులు
- తెలంగాణలో అప్పుల్లో ఉన్న 91.7 శాతం రైతులు
- రాజ్యసభలో వివరాలను వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
అందరికీ అన్నం పెడుతున్న మన దేశ అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ముఖ్యంగా ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో మన తెలుగు రాష్ట్రాలు ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఏపీలో 93.2 శాతం, తెలంగాణలో 91.7 శాతం రైతులు రుణభారంలో ఉన్నారు.
ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ (69.9 శాతం), కర్ణాటక (67.7 శాతం), తమిళనాడు (65.1 శాతం), ఒడిశా (61.2 శాతం), మహారాష్ట్ర (54 శాతం) రాష్ట్రాలు ఉన్నాయి. ఏపీలో రైతు భరోసా పథకం, తెలంగాణలో రైతుబంధు పథకాలు అమలవుతున్నా రైతులు అప్పులపాలు అవుతుండటం గమనార్హం.