భారీ ఆధిక్యం దిశగా టీమిండియా.. 500 దాటిన లీడ్
- ఆరు వికెట్లు కోల్పోయిన భారత్
- ఇప్పటి వరకు మూడు వికెట్లు పడగొట్టిన అజాజ్
- మరోమారు నిరాశ పరిచిన కోహ్లీ
న్యూజిలాండ్‌తో ముంబైలో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఓవర్ నైట్ స్కోరు 69/0తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 107 పరుగుల వద్ద మాయాంక్ అగర్వాల్ (62) రూపంలో మొదటి వికెట్‌ను కోల్పోయింది. దీంతో 107 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే మరో ఓపెనర్ చతేశ్వర్ పుజారా (47) వికెట్‌ను చేజార్చుకుంది. ఈ రెండూ అజాజ్ పటేల్ ఖాతాలోకే చేరాయి. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శుభమన్ గిల్ (47), కెప్టెన్ కోహ్లీ (36) క్రీజులో కుదురుకున్నట్టు కనిపించినా భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు.
అయ్యర్ (14), వృద్ధిమాన్ సాహా (13) క్రీజులో కుదురుకోవడంలో ఇబ్బంది పడి వికెట్లు సమర్పించుకున్నారు. భారత్ ప్రస్తుతం ఆరు వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసి 517 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత్ కోల్పోయిన ఆరు వికెట్లలో మూడు అజాజ్ పటేల్‌కు చిక్కగా, రచిన్ రవీంద్రకు మిగతా మూడు దక్కాయి.