పల్లె దవాఖానాలే రాలేదు.. 104 సేవలు బంద్ పెడతారా?: సీఎం కేసీఆర్ పై షర్మిల ఫైర్

  • గ్రామీణ ప్రజల కోసం ఆనాడు వైఎస్ ప్రవేశ పెట్టారని కామెంట్
  • నేడు ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాల్లేవని ఆరోపణ
  • వైద్యం అందక కరోనాతో జనాలు చనిపోతున్నారని సర్కార్ పై మండిపాటు
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 104 సర్వీసులను ప్రవేశపెట్టారని, కానీ, ఇప్పుడు వాటిని బంద్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల మండిపడ్డారు. ఇప్పటిదాకా ప్రారంభించని పల్లె దవాఖానాల కోసం 104 సేవలను ఆపేయాలని కేసీఆర్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం కనిపించకుండా పోయిందని, బస్తీ దవాఖానాలకు సుస్తీ చేసిందని విమర్శించారు. సర్కార్ దవాఖానాల్లో సౌకర్యాలు కరవయ్యాయని అన్నారు. పల్లె దవాఖానాలు ప్రారంభం కాకముందే 104 సేవలను బంద్ చేస్తున్నారంటే.. ప్రజల ప్రాణాల మీద కేసీఆర్ కున్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతోందని అన్నారు. సౌకర్యాల్లేక, వైద్యం అందక సర్కార్ దవాఖానాల్లో ప్రజలు కరోనాతో చనిపోతున్నారని ఆరోపించారు.


More Telugu News