ఆర్బీఐ ప్రకటనతో దూసుకుపోయిన మార్కెట్లు
- కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ
- 1,016 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 293 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచామన్న ఆర్బీఐ ప్రకటనతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,016 పాయింట్లు లాభపడి 58,650కి పెరిగింది. నిఫ్టీ 293 పాయింట్లు పుంజుకుని 17,470కి ఎగబాకింది. ఈరోజు అన్ని సూచీలు లాభపడ్డాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (3.67%), మారుతి సుజుకి (3.24%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.11%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.04%), సన్ ఫార్మా (2.60%).
టాప్ లూజర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.85%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.49%).