స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 20 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 5 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 3.25 శాతం పెరిగిన ఏసియన్ పెయింట్స్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్ల మూడు రోజుల జోరుకు ఈరోజు బ్రేక్ పడింది. ఉదయం నుంచి తీవ్ర ఒడిదుడుకులకు గురైన మార్కెట్లు చివరకు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గుచూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 20 పాయింట్లు కోల్పోయి 58,786కి పడిపోయింది. నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 17,511 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (3.25%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.25%), ఎం అండ్ ఎం (1.02%), టీసీఎస్ (0.91%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.69%).

టాప్ లూజర్స్:
టైటాన్ (-1.39%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.19%), యాక్సిస్ బ్యాంక్ (-0.92%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.86%), టెక్ మహీంద్రా (-0.59%).


More Telugu News