ఎన్టీఆర్ పెట్టుకున్న ఆ చేతి గడియారం ధర రూ.4 కోట్లు!

  • సోషల్ మీడియాలో హాట్ టాపిక్
  • రిచర్డ్ మిల్లీ నుంచి ఎఫ్1 లిమిటెడ్ ఎడిషన్ వాచ్
  • నిన్న ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ కు అదే వాచ్ తో వచ్చిన తారక్
‘ఆర్ఆర్ఆర్’.. మరో నెల రోజుల్లో మనందరి ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో బిజీబిజీ అయిపోతోంది చిత్ర యూనిట్. మూడు రోజుల క్రితం విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ సక్సెస్ కు సంబంధించి నిన్న ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, డీవీవీ దానయ్యలు పాల్గొన్నారు. ఆ మాటెలా ఉన్నా.. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ కు ఎన్టీఆర్ పెట్టుకొచ్చిన వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.


అవును మరి, ఆయన వాచ్ కున్న స్పెషాలిటీ అలాంటిది. అమెరికాకు చెందిన రిచర్డ్ మిల్లీ (ఆర్ఎం) బ్రాండ్ అది. ఆ బ్రాండ్ లోని 011 కార్బన్ ఎన్టీపీటీ గ్రోషన్ మోడల్ వాచ్ ను ఎన్టీఆర్ తన చేతికి తొడిగారు. అందులోనూ రోజ్ గోల్డ్ లోటస్ ఎఫ్ 1 టీమ్ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ అది. మరి ప్రైస్ మాత్రం మామూలుగా ఉంటుందా? ఆ వాచ్ ఖరీదు రూ.3,99,32,395. చెప్పాలంటే రౌండ్ ఫిగర్ రూ.4 కోట్లేసుకోండి. సెలబ్రిటీలన్నాక ఆ మాత్రం రేంజ్ ఉంటుందిలే అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. 


More Telugu News