లాభాల్లో ప్రారంభమై భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 503 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 143 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 3.10 శాతం నష్టపోయిన బజాజ్ ఫైనాన్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈ ఉదయం మార్కెట్లు సానుకూలంగానే ప్రారంభమయ్యాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 59,203 పాయింట్లను తాకింది. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 503 పాయింట్లు కోల్పోయి 58,283కి పడిపోయింది. నిఫ్టీ 143 పాయింట్లు నష్టపోయి 17,368కి దిగజారింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా ఈరోజు అన్ని సూచీలు నష్టపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (2.38%), టెక్ మహీంద్రా (2.20%), మారుతి సుజుకి (1.20%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.91%), టైటాన్ కంపెనీ (0.37%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-3.10%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.23%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.00%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.94%), నెస్లే ఇండియా (-1.51%).


More Telugu News