కామారెడ్డి జిల్లాలో నెత్తురోడిన రహదారి... ఆరుగురి మృతి

  • పెద్ద కొడపగల్ మండలంలో ఘటన
  • నిలిచి ఉన్న లారీని ఢీకొట్టిన క్వాలిస్
  • ప్రమాదం సమయంలో వాహనంలో 12 మంది
  • బిచ్కుంద నుంచి పిట్లం వైపు వెళుతుండగా ఘటన
కామారెడ్డి జిల్లాలో రహదారి రక్తదాహానికి ఆరుగురు బలయ్యారు. ఓ లారీని క్వాలిస్ వాహనం ఢీకొన్న ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 12 మంది ఉన్నారు. వీరంతా ఓ పెళ్లికి వెళ్లి వస్తున్నారు. మృతులు హైదరాబాద్ నగరానికి చెందినవారు. పెద్ద కొడపగల్ మండలంలోని జగన్నాథపల్లి శివారులో జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. బిచ్కుంద నుంచి పిట్లం వైపు వెళుతున్న క్వాలిస్ రోడ్డుపై నిలిచి ఉన్న లారీని బలంగా ఢీకొట్టినట్టు గుర్తించారు.


More Telugu News