ఒమిక్రాన్ దెబ్బకు కుప్పకూలిన మార్కెట్లు
- 1,189 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 371 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 5 శాతానికి పైగా నష్టపోయిన టాటా స్టీల్
ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులతో మళ్లీ టెన్షన్లు పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్లలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు అప్రమత్తం అవుతున్నారు. ఇప్పటికే యూరప్ లోని పలు దేశాలు మళ్లీ లాక్ డౌన్ విధించాయి. దీంతో రిస్క్ తీసుకోవడం ఎందుకనుకుంటున్న మదుపరులు వారి స్టాకులను అమ్ముకుంటూ లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు.
ఈ నేపథ్యంలో ఈరోజు మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,189 పాయింట్లు నష్టపోయి 55,822 వద్దకు పడిపోయింది. నిఫ్టీ 371 పాయింట్లు కోల్పోయి 16,614కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (1.70%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.02%).
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-5.20%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.23%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.97%), బజాజ్ ఫైనాన్స్ (-3.89%), ఎన్టీపీసీ (-3.11%).