నాన్న చనిపోతే వచ్చిన డబ్బుతో డ్రమ్స్ కొన్నాను: సంగీత దర్శకుడు తమన్

  • మా నాన్న మంచి డ్రమ్మర్
  • చాలా సినిమాలకు పనిచేశారు
  • హార్ట్ ఎటాక్ తో చనిపోయారు
  • నా తొలి పారితోషికం 30 రూపాయలు
తమన్ .. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అందించడంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నవాడాయన. టాలీవుడ్ స్టార్ హీరోలంతా కూడా తమ సినిమాలకి ఆయన పనిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న తమన్ .. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చాడు.

"మా నాన్న డ్రమ్స్ చాలా బాగా వాయించేవాడు .. ఆయన చాలా సినిమాలకి పనిచేశారు. అందువలన సహజంగానే నాకు డ్రమ్స్ వాయించడం పట్ల ఆసక్తి పెరుగుతూ పోయింది. ఒకసారి మేమంతా ఢిల్లీలోని మా అత్తయ్య ఇంటికి వెళ్లి ట్రైన్ లో వస్తుండగా, మా నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చింది. ట్రీట్మెంట్ ఆలస్యం కావడంతో ఆయన చనిపోయారు.

నాన్న చనిపోవడంతో ఆయన ఎల్ఐసి పాలసీకి సంబంధించి 60 వేలు వచ్చాయి. ఆ డబ్బును ఇంట్లో వాడకుండా మా అమ్మ నాకు డ్రమ్స్ కొనిపెట్టింది. ఆ డ్రమ్స్ తో నేను సాధన చేస్తూ, డ్రమ్మర్ గా ముందుకు వెళ్లాను. నేను డ్రమ్మర్ గా పనిచేసిన ఫస్టు మూవీ 'భైరవద్వీపం'. ఆ సినిమాకిగాను నాకు పారితోషికంగా 30 రూపాయలు ఇచ్చారు" అని చెప్పుకొచ్చాడు.


More Telugu News