మూడు రోజుల లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- 190 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 68 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 2.69 శాతం పడిపోయిన ఎన్టీపీసీ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాల్లో ముగించాయి. వరుసగా మూడు రోజుల పాటు లాభాలను మూటగట్టుకున్న మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 190 పాయింట్లు నష్టపోయి 57,124కి పడిపోయింది. నిఫ్టీ 68 పాయింట్లు కోల్పోయి 17,003 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.08%), టెక్ మహీంద్రా (2.34%), ఏసియన్ పెయింట్స్ (0.65%), విప్రో (0.55%), ఇన్ఫోసిస్ (0.37%).
టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-2.69%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.47%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.71%), యాక్సిస్ బ్యాంక్ (-1.59%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.57%).