విజ‌య‌శాంతి, స్వామిగౌడ్‌తో క‌లిసి దీక్ష‌కు దిగిన బండి సంజ‌య్‌

  • యువ‌త‌కు ఉద్యోగాలు ఇవ్వాల‌ని డిమాండ్
  • సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ‘నిరుద్యోగ దీక్ష’
  • హైద‌రాబాద్‌లోని పార్టీ కార్యాల‌యంలోనే కొన‌సాగింపు
తెలంగాణ యువ‌త‌కు ఉద్యోగాలు ఇవ్వ‌కుండా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్ర‌వ‌ర్తిస్తోన్న తీరుకు నిర‌స‌న‌గా హైద‌రాబాద్‌లోని బీజేపీ కార్యాల‌యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ ‘నిరుద్యోగ దీక్ష’కు దిగారు. మొద‌ట ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేప‌ట్టాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ చివ‌ర‌కు పార్టీ కార్యాల‌యంలోనే ఆయ‌న దీక్ష‌కు దిగారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరించాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న డిమాండ్ చేశారు.

ఈ రోజు సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ఆయ‌న దీక్ష చేయ‌నున్నారు. బండి సంజ‌య్‌తో పాటు బీజేపీ నేతలు విజ‌య‌శాంతి, స్వామిగౌడ్ స‌హా ప‌దాధికారులు దీక్ష‌కు కూర్చున్నారు. దీక్ష చేస్తుంటే తెలంగాణ స‌ర్కారు ఎందుకు భ‌య‌ప‌డుతోంద‌ని వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలు, నిరుద్యోగం వంటి స‌మ‌స్య‌ల‌పై తాము పోరాడ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు.


More Telugu News