దూసుకుపోయిన మార్కెట్లు.. 477 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

  • 147 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2.85 శాతం పెరిగిన ఏసియన్ పెయింట్స్ షేర్ విలువ
  • లాభాలను ముందుండి నడిపించిన సీజీ, ఐటీ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత ఇంకా పుంజుకున్నాయి. కన్జ్యూరబుల్ డ్యూరబుల్స్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ షేర్లు లాభాలను ముందుండి నడిపించాయి.

దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 477 పాయింట్లు పెరిగి 57,897కి చేరుకుంది. నిఫ్టీ 147 పాయింట్లు లాభపడి 17,233 వద్ద స్థిరపడింది. ఈరోజు అన్ని సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్;
ఏసియన్ పెయింట్స్ (2.85%), సన్ ఫార్మా (2.59%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.53%), అల్ట్రాటెక్ సిమెంట్స్ (2.16%), టైటాన్ (2.12%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.29%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.22%).


More Telugu News