కొత్త సంవత్సరాన్ని భారీ లాభాలతో ప్రారంభించిన మార్కెట్లు

  • 929 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 272 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 3.50 శాతం పెరిగిన బజాజ్ ఫైనాన్స్ షేర్ విలువ
కొత్త సంవత్సరం తొలి ట్రేడింగ్ సెషన్ ను దేశీయ స్టాక్ మార్కెట్లు ఘనంగా ప్రారంభించాయి. ఈరోజు మార్కెట్లు దూసుకుపోయాయి. ఫైనాన్స్, ఆటో, ఐటీ స్టాకులు లాభాలను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 929 పాయింట్లు లాభపడి 59,183కి చేరుకుంది. నిఫ్టీ 272 పాయింట్లు పెరిగి 17,626 వద్ద స్థిరపడింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (3.50%), బజాన్ ఫిన్ సర్వ్ (3.49%),  ఐసీఐసీఐ బ్యాంక్ (3.41%), యాక్సిస్ బ్యాంక్ (2.86%), టాటా స్టీల్ (2.85%).
 
టాప్ లూజర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.13%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.91%), టెక్ మహీంద్రా (-0.34%), నెస్లే ఇండియా (-0.04%).


More Telugu News