ఈరోజు కూడా భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 673 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 180 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 5 శాతానికి పైగా పెరిగిన ఎన్టీపీసీ షేర్ విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లలో కొత్త సంవత్సర జోష్ కనపడుతోంది. కొత్త ఏడాదిలో వరుసగా రెండో సెషన్ లో కూడా భారీ లాభాలు నమోదయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాకులు లాభాలను ముందుండి నడిపించాయి.
ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండటం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 673 పాయింట్లు లాభపడి 59,856కి చేరుకుంది. నిఫ్టీ 180 పాయింట్లు పెరిగి 17,805కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (5.48%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.73%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.69%), టైటాన్ (2.31%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.22%).
టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-1.09%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.85%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.82%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-0.11%), ఇన్ఫోసిస్ (-0.05%).