ఓవర్సీస్ లో 'పుష్ప' హిందీ వెర్షన్ రిలీజ్!
- తెలుగులో తగ్గని 'పుష్ప' జోరు
- 100 కోట్ల క్లబ్ దిశగా హిందీ వెర్షన్
- ఓవర్సీస్ లో తగ్గని సందడి
- బన్నీ కి బ్లాక్ బస్టర్స్ లో 'పుష్ప'కు స్థానం
సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో మూడో సినిమాగా వచ్చిన 'పుష్ప' సంచలన విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన ప్రతి భాషలో .. ప్రతి ప్రాంతంలో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా తన సత్తా చాటుతోంది. చాలా వేగంగా ఈ సినిమా 300 కోట్ల క్లబ్ లో చేరిపోవడం విశేషం.
ఈ సినిమాను హిందీలో విడుదల చేయగా అక్కడ కూడా అత్యధిక వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. 15 రోజుల్లోనే ఈ సినిమా అక్కడ 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది .. 100 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. కరోనా కారణంగా అక్కడి థియేటర్స్ కి జనం రావడం కాస్త తగ్గడం వలన ఈ మార్క్ ను టచ్ చేయడంలో కాస్త ఆలస్యమైందని అంటున్నారు.
ఇక ఓవర్సీస్ లోను ఈ సినిమా ఇంతవరకూ అంచనాలకు మించిన వసూళ్లను ఇచ్చింది. ఈ నేపథ్యంలో హిందీ వెర్షన్ ను కూడా అక్కడ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో అక్కడ ఈ సినిమాను రిలీజ్ చేసిన సంస్థ వారే, హిందీ వెర్షన్ ను కూడా విడుదల చేస్తున్నారు. ఇక హిందీ వెర్షన్ ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందనేది చూడాలి.