క్లాత్ మాస్కును ఇలా ధరిస్తేనే.. కరోనా నుంచి మీకు రక్షణ
- ఒక్క లేయర్ ఉన్న వాటితో రక్షణ లభించదు
- మూడు లేయర్లు ఉన్న వాటిని వాడుకోవాలి
- సర్జికల్ మాస్క్ తో కలిపి వాడుకుంటే మరింత రక్షణ
- అమెరికా సీడీసీ విభాగం మార్గదర్శకాలు
మన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది క్లాత్ మాస్క్ (వస్త్రంతో తయారు చేసినవి)లను ధరిస్తూ కనిపిస్తుంటారు. సర్జికల్ డిస్పోజబుల్ మాస్కులు చౌకగా లభిస్తుండడంతో వాటిని కూడా చాలా మంది వినియోగిస్తున్నారు. కొద్ది మంది ఎన్95 తరహా మాస్కులు ధరిస్తున్నారు. కానీ, క్లాత్ మాస్క్ లు ధరించే వారు ఒకసారి పునరాలోచించుకోవాల్సిందే. వీటితో పూర్తి రక్షణ ఉండదని నిపుణులు చెబుతున్నారు.
కనీసం రెండు మూడు లేయర్ల ఫేస్ మాస్క్ ను అయినా ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. అప్పుడే సూక్ష్మ గాలి తుంపర్లు మాస్క్ నుంచి రాకుండా ఉంటాయని, వైరస్ వ్యాప్తిలోకి వెళ్లకుండా నివారించడం సాధ్యపడుతుందని భావిస్తున్నారు. సర్జికల్ మాస్క్ తో కలిపి ఒక్క లేయర్ ఉన్న క్లాత్ మాస్క్ ను వాడుకోవచ్చని సూచిస్తున్నారు. లేదంటే రెస్పిరేటరీ మాస్కులు ధరించడం మంచిదని పేర్కొంటున్నారు. అప్పుడే ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పించుకోవచ్చని సూచిస్తున్నారు.
ముఖ్యంగా ఒక్క లేయర్ ఉన్న క్లాత్ మాస్క్ లు పెద్ద గాలి తుంపర్లను సమర్థంగా అడ్డుకోగలవే కానీ, ఒమిక్రాన్ రకంలో మాదిరి సూక్ష్మ తుంపర్లను నిలువరించలేవని చెబుతున్నారు. రెండేళ్ల వయసుకు మించిన ప్రతి ఒక్కరూ ఇళ్లల్లోనూ మాస్కులు ధరించాలని అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, నిరోధక విభాగం (సీడీసీ) సూచించింది.
‘‘ఒకటికి మించి ఎక్కువ లేయర్లతో కూడిన క్లాత్ మాస్కు కింద డిస్పోసబుల్ మాస్కు ధరించండి. పైన పెట్టే మాస్కు కింది మాస్కు పైనుంచి గడ్డం దిగువ భాగాన్ని కవర్ చేసే విధంగా ఉండాలి’’ అని సీడీసీ సూచించింది. తిరిగి వినియోగించడానికి పనికొచ్చే (రీయూజబుల్) మాస్కులను రోజుకు ఒకసారి అయినా శుభ్రం చేసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది. డిస్పోజబుల్ మాస్క్ అయితే ఒక పర్యాయం వాడిన తర్వాత పడేసేయాలని సూచించింది.