దేశంలో మళ్లీ భారీగా నమోదైన కరోనా కేసులు
- కొత్తగా 1,41,986 కేసులు
- 285 మంది మృతి
- డైలీ పాజిటివిటీ రేటు 9.28 శాతం
- మృతుల సంఖ్య 4,83,463
దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో నిన్న కొత్తగా 1,41,986 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్లో తెలిపింది. నిన్న కరోనా నుంచి 40,895 మంది కోలుకున్నారు. అలాగే, 285 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.
ఇక డైలీ పాజిటివిటీ రేటు 9.28 శాతంగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 4,72,169 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,44,12,740 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 4,83,463గా ఉంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 150.06 కోట్ల కరోనా డోసుల వ్యాక్సిన్లు వేశారు.