ప్రభుత్వ నిర్ణయంలో తప్పేముంది?: సినిమా టికెట్ల వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

  • సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారన్న నల్లపురెడ్డి
  • హైదరాబాదులో ఉంటున్న సినిమా వాళ్లకు ఏపీ గుర్తుందా?
  • టికెట్ ధర తగ్గితే సామాన్యులు కూడా సినిమా చూస్తారన్న ప్రసన్నకుమార్  
సినిమా టికెట్ల వ్యవహారం ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కి మధ్య అగాధాన్ని పెంచుతోంది. టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న హీరోలపై ఇప్పటికే రాష్ట్ర మంత్రులు విమర్శలు గుప్పించారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సినిమా వాళ్లపై పలు వ్యాఖ్యలు చేశారు.

సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లకు ఏపీ గుర్తుందా? అని ఎద్దేవా చేశారు. టికెట్ ధరలు తగ్గిస్తే సామాన్యులు కూడా సినిమాలు చూస్తారని... ప్రభుత్వ నిర్ణయంలో తప్పేముందని ప్రశ్నించారు. సినిమా వాళ్లంతా హైదరాబాదులోనే ఉంటున్నారని... వాళ్లకు ఏపీ ఎక్కడ గుర్తుందని నల్లపురెడ్డి అన్నారు. మంత్రి పేర్ని నానితో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయిన సమయంలో నల్లపురెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


More Telugu News