చిరంజీవిని 'ఆచార్యా' అని పలకరించిన సీఎం జగన్.. 'ఎప్పుడంటే అప్పుడు భోజనానికి వచ్చేయండన్నా' అని అన్నారన్న మెగాస్టార్!

  • జగన్ ఇంటికి వెళ్లిన చిరంజీవి
  • జగన్ తనకు సోదర సమానుడన్న చిరు
  • జగన్ భార్య భారతి స్వయంగా వడ్డించడం సంతోషకరమని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మెగాస్టార్ చిరంజీవి ఈరోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. తాడేపల్లిలోని చిరంజీవి నివాసానికి ఆయన వెళ్లారు. కారు దిగిన చిరంజీవికి జగన్ ఎదురొచ్చి స్వాగతం పలికారు. 'రండి ఆచార్యా... వెల్ కమ్ ఆచార్యా' అంటూ చిరును జగన్ ఆహ్వానించారు. ఆ తర్వాత జగన్ తో కలిసి చిరంజీవి భోజనం చేశారు. దాదాపు గంటకు పైగా సినీ సమస్యలు, టికెట్ ధరలపై వీరు చర్చించారు.

మరోవైపు జగన్ దంపతుల ఆతిథ్యం గురించి చిరంజీవి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. పండగ పూట ఇంటికి పిలిచి ఆప్యాయంగా మాట్లాడారని అన్నారు. జగన్ సతీమణి భారతి దగ్గరుండి వడ్డించడం సంతోషకరమని చెప్పారు. తదుపరి అపాయింట్ మెంట్ ఎప్పుడని తాను అడగ్గా... ఎప్పుడంటే అప్పుడు భోజనానికి వచ్చేయండన్నా అని జగన్ అన్నారని తెలిపారు. జగన్ తనకు సోదర సమానుడని చెప్పారు. సీఎంతో భేటీ సంతృప్తికరంగా జరిగిందని చెప్పారు.


More Telugu News